Saturday, April 20, 2024

రాఘ‌వ లారెన్స్‌తో విల‌న్‌గా ఖైదీ-2.. విక్ర‌మ్ మూవీ బ్యాక్‌డ్రాప్‌గా తెర‌పైకి!

లోకేష్ క‌న‌గ‌రాజ్ డైరెక్ట్ చేసిన మూవీస్‌లో ఒక‌దానికి ఒక‌టి క‌నెక్ష‌న్ ఉంటుంది. ఈ విష‌యాన్ని సినీ విమర్శ‌కులు సైతం అంగీక‌రిస్తున్నారు. ఇక మొన్న‌టికి మొన్న బెస్ట్ మూవీగా నిలిచి కోట్లాది రూపాయ‌ల‌ను కొల్ల‌గొట్టిన క‌మ‌ల్‌హాస‌న్‌ విక్ర‌మ్ మూవీకి ఇంత‌కుముందు వ‌చ్చిన ఖైదీ మూవీకి లింక్ ఉంటుంది. దీన్నే లోకీవర్స్ అని కూడా అంటున్నారు అభిమానులు.

ఇక‌.. లేటెస్ట్‌గా సినీ వ‌ర్గాల నుంచి వినిపిస్తున్న టాక్ ప్ర‌కారం.. కొరియోగ్రాఫ‌ర్ అండ్ డైరెక్ట‌ర్ అయిన రాఘ‌వ లారెన్స్‌తో క‌న‌గ‌రాజ్ ఓ మూవీ తీయ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ మూవీ వ‌చ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్ల‌నుంద‌ట‌. అయితే ఈ ఖైదీ-2 మూవీలో రాఘ‌వ విల‌న్‌గా న‌టించ‌నున్న‌ట్టు స‌మాచారం. అది కూడా విక్ర‌మ్ మూవీలో రోలెక్స్ (విక్రమ్‌లో సూర్య రోల్‌) బ్యాచ్‌లో కీల‌క స‌భ్యుల‌లో రాఘ‌వ ఒక‌డిగా ఉండ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఆ మూవీకి లింక్‌పెట్టి ఖైదీ-2 ర‌న్ అవుతుంద‌ని సినీ వ‌ర్గాల నుంచి గాసిప్స్ వ‌స్తున్నాయి. ప్రస్తుతం, డైరెక్ట‌ర్‌ లోకేష్ కనగరాజ్ తన తదుపరి భారీ చిత్రం తలపతి 67 కోసం రెడీ అవుతున్నాడు. రాబోయే రోజుల్లో ప్రారంభం కానున్న మాస్ ఎంటర్‌టైనర్‌లో విజయ్ ప్రధాన పాత్రలో న‌టించ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement