Thursday, April 18, 2024

రాధే శ్యామ్ లేటెస్ట్ అప్డేట్

రాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రాధే శ్యామ్. పీరియాడికల్ లవ్ స్టొరీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కృష్ణంరాజు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్, మోషన్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే గత రెండేళ్లుగా ఈ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది. కాగా మొన్ననే ఏ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

అయితే తాజా సమాచారం ప్రకారం….మరో మూడు రోజులు ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ షూటింగ్ జరగనుందట. రేపటి నుంచి కడపలోని గండికోటలో ప్రారంభమై మూడు రోజులలో చిత్రీకరణ పూర్తి చేస్తారట. ఈ స్పెషల్ షూట్ అంతా మూవీ ఓపెనింగ్ క్రెడిట్ కోసం అని తెలుస్తోంది. అలాగే ఈ సినిమా షూట్ లో నటీనటులు ఎవ్వరూ కూడా పాల్గొన్నారట.

Advertisement

తాజా వార్తలు

Advertisement