Friday, April 19, 2024

రాధే శ్యామ్…మూవీ షూట్ పై లేటెస్ట్ అప్డేట్ !!

రాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రాధేశ్యామ్. పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బుట్ట బొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన మోషన్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ మూవీ కొన్ని సన్నివేశాలను రీషూట్ కు ప్లాన్ చేసింది. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ కూడా చేశారు.

అయితే ఇప్పుడు ఆఖరి షెడ్యూల్ ఈ నెల 23వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు చేయనున్నారట. ఈ చిత్రీకరణతో సినిమా పూర్తిగా ఎండ్ అవుతుందట. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే కృష్ణంరాజు కూడా ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement