Thursday, April 25, 2024

రాధే శ్యామ్ అమెజాన్ ప్రైమ్ అదిరిపోయే ఆఫర్ ?

రాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రాధేశ్యామ్. పిరియాడికల్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోంది. దాదాపు షూటింగ్ మొత్తం పూర్తి కాగా మరో పది రోజులు రీషూట్ కి యూనిట్ ప్లాన్ చేసింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఈ సినిమా రిలీజ్ పై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. యూనిట్ నుంచి మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు.

అయితే ఈ సినిమాకు ఓటీటీల నుంచి పెద్ద సంఖ్యలో ఆఫర్స్ వస్తున్నాయట. కొన్నాళ్ళ క్రితం డిజిటల్ రైట్స్ పరంగా హాట్ స్టార్, జి 5 వారు మంచి ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు రాగా తాజాగా అమెజాన్ ప్రైమ్ సంస్థ 400 కోట్ల రూపాయల భారీ బంపర్ ఆఫర్ ను ఇచ్చినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. మరి సినిమా థియేటర్స్ లో రిలీజ్ చేస్తారా ఓటీటీ లో రిలీజ్ చేస్తారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement