Thursday, April 25, 2024

రామారావు ఆన్‌డ్యూటీ ట్రైల‌ర్ రిలీజ్‌.. 29న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రిలీజ్ కానున్న మూవీ

రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీని బిగ్ స్క్రీన్‌పై చూడటానికి ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. శరత్ మండవ తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్టు ఈ ఏడాది జులై 29న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. కాగా ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ట్రైలర్‌ను ఈ రోజు (శ‌నివారం) మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

ఆర్‌టి టీమ్‌వర్క్స్‌తో కలిసి ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అందించిన ఈ మూవీలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ కూడా హీరోయిన్లుగా నటించారు. వేణు తొట్టెంపూడి, నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, ‘సర్పట్ట’ జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, ఈరోజుల్లో శ్రీ, మధు సూదన్ రావు, సురేఖా వాణి తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement