Saturday, April 20, 2024

రజినీకాంత్ వెనక్కి !! టాప్ 2 లో పుష్ప

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లారీ డ్రైవర్ పుష్ప రాజుగా అల్లుఅర్జున్ కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాను రెండు పార్టులుగా రిలీజ్ చేయబోతున్నట్లు గా దర్శకనిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇటీవల ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే తెలుగులో మోస్ట్ న్యూస్ సంపాదించిన టీజర్ గానే కాకుండా ఇప్పుడు ఇండియన్ వైడ్ కూడా అత్యధిక వ్యూస్ సంపాదించిన టీజర్ గా మరో రికార్డు క్రియేట్ చేసింది.

ఇండియాలో అత్యధిక వ్యూస్ అందుకున్న టీజర్ గా కే జి ఎఫ్ చాప్టర్ 2 నిలిచింది. మొత్తం 191 మిలియన్ వ్యూస్ తో మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానంలో రజనీకాంత్ నటించిన 2.0.. 72.44 రెండో ప్లేస్ లో ఉండగా ఇప్పుడు పుష్ప దాన్ని బీట్ చేసి టాప్ 2 లో నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement