Thursday, April 25, 2024

పుష్ప అస్సలు తగ్గట్లేదుగా

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా పుష్ప కు సంబంధించి ఫస్ట్ సింగల్ రిలీజ్ అయింది. దాక్కో దాక్కో మేక అంటూ సాగే ఈ సాంగ్ సోషల్ మీడియాలో దుమ్ము దులుపుతుంది. అయితే ఈ సాంగ్ మొత్తం ఐదు భాషల్లో రిలీజ్ కాగా అన్నింటిలోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది.

అన్నిటి కంటే అధికంగా తెలుగులో రెస్పాన్స్ వస్తోంది. గడచిన 24 గంటల్లో ఆల్ టైమ్ రికార్డ్ రియల్ టైమ్ వ్యూస్ 9.4 మిలియన్ వ్యూస్ సాధించగా…6లక్షల 57వేల లైక్స్ తో రికార్డు సృష్టించింది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్, విజువల్ ఎఫెక్ట్ అన్ని కూడా ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా కనిపించబోతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement