Wednesday, November 30, 2022

తగ్గేదేలే!! 20 మిలియన్ల వ్యూస్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా అల్లుఅర్జున్ కనిపించబోతున్నాడు. అలాగే రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపిస్తున్నాడు.

- Advertisement -
   

ఇదిలా ఉండగా ఇటీవల పుష్ప ఫస్ట్ సింగిల్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. దాక్కో దాక్కో మేక అంటూ సాగే ఈ సాంగ్ సోషల్ మీడియాలో దుమ్ము దులుపుతుంది. రిలీజ్ చేసిన 24 గంటలలోనే 9.4 మిలియన్ల వ్యూస్ సాధించిన ఈ సాంగ్ ఒక్క తెలుగులో తాజాగా 20 మిలియన్ల ప్లస్ వ్యూస్ అలాగే 600 కే లైక్స్ సాధించింది. మొత్తం తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ భాషలలో ఈ పాట విడుదలైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement