Tuesday, April 16, 2024

ఉత్తమ చిత్రంగా సైమా అవార్డులు దక్కించుకున్న పుష్ప.. బెస్ట్​ హీరోగా ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్​

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫిల్మ్ అవార్డులలో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) ఒకటి. ఈ అవార్డుతో నాలుగు ప్రాంతీయ భాషల (తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ) సినిమాలకు చెందిన కళాకారులను సత్కరిస్తారు. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ లేదా SIIMA అవార్డ్స్ 2022 10వ ఎడిషన్ నిన్న‌ (శ‌నివారం) బెంగళూరులో గ్రాండ్​గా ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ పరిశ్రమలకు చెందిన నటీనటులు, ప్రముఖులు హాజరుఅయ్యారు. 2012లో విష్ణు వర్ధన్ ఇందూరి, బృందా ప్రసాద్ అడుసిమిల్లి స్థాపించిన SIIMA అవార్డ్స్.. ప్రతి సంవత్సరం దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలకు చెందిన చిత్రనిర్మాతలను సత్కరిస్తోంది.

అల్లు అర్జున్.. పుష్ప ది రైజ్.. ఈ ఏడాది అవార్డ్స్‌లో అత్యధికంగా నామినేట్ అయిన తెలుగు సినిమాగా నిలిచింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 12 విభాగాల్లో నామినేట్ అయింది. ఎర్ర చెంద‌నం స్మగ్లింగ్ అండర్‌వరల్డ్‌లో రోజువారీ కూలీ ఎదుగుదల కథను ఆధారంగా తెర‌కెక్కించాడు సుకుమార్. కాగా, టాలీవుడ్ నుంచి పుష్ప సినిమా అత్యధిక అవార్డులను దక్కించుకుంది. ఉత్తమ సినిమాగా పుష్ప అవార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమాకు బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్, బెస్ట్ డైరెక్టర్ గా సుకుమార్ సైమా అవార్డులను అందుకున్నారు. పుష్ప సినిమాకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీప్రసాద్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ జగదీష్ ప్రసాద్, బెస్ట్ లిరిసిస్ట్ గా చంద్రబోస్ అవార్డులు గెలుచుకున్నారు.

ఇక‌.. ఉత్తమ నటిగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాకు పూజాహెగ్డే అవార్డును సొంతం చేసుకున్నది. బెస్ట్ సపోర్టింగ్ రోల్ లో వరలక్ష్మి శరత్ కుమార్ (క్రాక్) అవార్డ్ అందుకున్నది. ఉప్పెన సినిమాతో బెస్ట్ డెబ్యూ హీరోగా వైష్ణవ్ తేజ్, బెస్ట్ డెబ్యూ హీరోయిన్ గా కృతిశెట్టి, డెబ్యూ డైరెక్టర్ గా బుచ్చిబాబు అవార్డులను దక్కించుకున్నారు. క్రిటిక్స్ చాయిస్ విభాగంలో బెస్ట్ యాక్టర్ గా నవీన్ పొలిశెట్టి అవార్డు గెలుచుకున్నారు. ఈవెంట్ కోసం బెంగళూరుకు వచ్చిన ఇతర ప్రముఖుల ఫొటోలు చూడొచ్చు..

Advertisement

తాజా వార్తలు

Advertisement