Tuesday, April 23, 2024

“పుష్ప ది రైజ్”: శ్రీవల్లిగా రష్మిక లుక్ అదుర్స్..

క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటిస్తున్న చిత్రం ‘పుష్ప’రాజ్. శేషాచలం కొండలలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ ఆధారంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ రెండు భాగాలుగా రానుంది. క్రిస్మస్ కానుకగా మొదటి భాగం “పుష్ప : ది రైజ్-పార్ట్ 1″ను విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. కాగా తాజాగా ఈ చిత్రంలో రష్మిక మందన్న లుక్ ను విడుదల చేశారు. భయంకరమైన ‘పుష్ప’రాజ్ లవర్ శ్రీవల్లిని పరిచయం చేశారు. ఆ పోస్టర్ లో ఆమె రెడీ అవుతూ కన్పిస్తోంది. తాంబూలంలో పట్టు చీరతో పాటు పువ్వులు కూడా ఉన్నాయి. శ్రీవల్లి పెళ్ళికి రెడీ అవుతున్నట్టు అర్థమవుతోంది. ఇటీవల ఇచ్చిన అప్డేట్ ప్రకారం త్వరలోనే సెకండ్ సింగిల్ రాబోతోంది. ఈ చిత్రంలో మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. ముత్తంశెట్టి మీడియా సహకారంతో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి అప్డేట్ ను ప్రకటించారు మేకర్స్.

ఇది కూడా చదవండి: చిరు, పవన్ కూడా నాకే ఓటు వేస్తారు: మంచు విష్ణు..

Advertisement

తాజా వార్తలు

Advertisement