Thursday, April 18, 2024

పుష్ప నెంబర్ వన్…కేజీఎఫ్ 2 సెకండ్!!

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ కు సోషల్ మీడియా లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. ఇదిలా ఉండగా ఇటీవల imdb నిర్వహించిన ఒక సర్వేలో మోస్ట్ యాంటిసిపేటెడ్ న్యూ ఇండియన్ మూవీ సినిమా కేటగిరిలో కే జి ఎఫ్ చాప్టర్ టు 22.01 శాతంతో అగ్రస్థానంలో నిలువగా …15.7 శాతం తో అల్లు అర్జున్ పుష్ప రెండవ స్థానంలో నిలిచాయి.

అయితే ఈ విషయం తెలిసిన అల్లు అర్జున్ అభిమానులు ఫ్యానిజం చూపించారు. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం కే జి ఎఫ్ చాప్టర్ 2 ను పక్కకు తోసేసి పుష్ప ఫస్ట్ ప్లేస్ లో చేరింది. పుష్ప మూవీ 27.1 శాతంతో ఫస్ట్ ప్లేస్ లో నిలువగా కేజీఎఫ్ చాప్టర్2 21.5 శాతం తో రెండో స్థానంలో నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement