Saturday, April 20, 2024

ర‌ష్యాలో రిలీజ్ కానున్న పుష్ప మూవీ.. ప్రమోషన్స్ ఏర్పాట్ల‌లో మేక‌ర్స్‌

గ్లోబల్ బ్లాక్ బస్టర్ అయిన ఆర్ఆర్ఆర్ జపాన్‌లో విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇక ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వంతు వచ్చింది. అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రైజ్ రష్యాలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియన్ మూవీ గత ఏడాది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా రష్యా లో రిలీజ్ అవ్వనున్నట్టు ఇవ్వాల మైత్రీ మూవీ మేకర్స్ తాజాగా ఒక ప్రకటన చేయడం జరిగింది.

పుష్ప ది రైజ్ రష్యన్ డబ్బింగ్ వెర్షన్ డిసెంబర్ 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అల్లు అర్జున్‌తో సహా పుష్ప టీమ్ వరుసగా డిసెంబర్ 1 నుంచి 3వ తేదీల్లో మాస్కో, సెయింట్ పీటర్స్‌ బర్గ్‌ లలో గ్రాండ్ ప్రీమియర్‌లకు హాజరు కానుంది. పుష్పలో రష్మిక మందన్న కథానాయికగా నటించింది. ఇందులో జగదీష్, అనసూయ భరద్వాజ్, సునీల్, రావు రమేష్, ఫాహద్ ఫజిల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ బ్లాక్ బస్టర్ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement