Thursday, April 18, 2024

రెండు కోట్ల రూపాయలతో పుష్ప ఫస్ట్ సింగిల్ ?

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పుష్పరాజ్ గా కనిపించబోతున్నాడు. అలాగే రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నారు. అయితే ఈ సినిమా మా ఫస్ట్ సింగిల్ కోసం సినీ అభిమానులతో పాటు మెగా అభిమానులు కూడా ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు.

అయితే తాజాగా ఫస్ట్ సింగిల్ కి సంబంధించిన ఓ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సాంగ్ కు రెండు కోట్ల రూపాయల వరకు బడ్జెట్ ను ఖర్చు చేశారట. ఓన్లీ విజువల్ కోసమే అంత ఖర్చు చేశారట చిత్రయూనిట్. మరి ఈ తాము ఎలాంటి విజువల్ ను సుకుమార్ చూపించారో చూడాలి. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement