Saturday, April 20, 2024

ఫస్ట్ సింగిల్ ప్రోమోతో రచ్చ లేపిన పుష్ప రాజ్

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా ఫస్ట్ సింగిల్ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 13న ఈ ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేసింది చిత్రయూనిట్.

కాగా తాజాగా ఆ సాంగ్ కు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. దాక్కో దాక్కో మేక సాగే ఈ సాంగ్ కు అదిరిపోయే మ్యూజిక్ అందించారు దేవి శ్రీ ప్రసాద్. అల్లు అర్జున్ కూడా మాస్ లుక్ లో కనిపించి అంచనాలను మరింత ఎక్కువ చేశారు. మరి ఈ ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement