Friday, March 29, 2024

ఈడీ ఆఫీసుకు పూరి, ఛార్మి.. ఫెమా నిబంధనల ఉల్లంఘనపై నోటీస్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: లైగర్‌ వివాదాలు ప్రముఖ సినీదర్శకుడు పూరి జగన్నాధ్‌ను చుట్టుముట్టి వదలడం లేదు. ఈ సినిమా నిర్మాణంలో రాజకీయ నేతల బ్లాక్‌ మనీ పెట్టుబడిగా పెట్టారని, ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని ఫిర్యాదులు అందడంతో వారం క్రితం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్శక నిర్మాత పూరి జగన్నాధ్‌కు, నిర్మాణ భాగస్వామి ఛార్మికి నోటీసులు జారీచేసింది. ఉదయం 8గంటలకే ఈడీ ఆఫీసుకు వెళ్ళగా, 13గంటలకు పైగా విచారణ కొనసాగింది. ప్రధానంగా విదేశీ పెట్టుబడులు, ఫెమా నిబంధనల ఉల్లంఘనపై ఈ విచారణ సాగినట్లు తెలుస్తోంది. పెట్టుబడిదారుల వివరాలపై విచారణ జరిపినట్లు సమాచారం. విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాలో రాజకీయ నేతలు పెట్టుబడులు పెట్టినట్లు ఫిర్యాదులు అందగా, నోటీసు జారీచేసిన అధికారులు గురువారం విచారణ నిర్వహించారు. విచారణ సుదీర్ఘంగా సాగడంతో.. ఉత్కంఠ నెలకొంది. విదేశీ పెట్టుబడులతో పాటు స్థానిక పెట్టుబడులపై విచారణ జరిపారు.

ఫెమా నిబంధనల బ్రేక్‌

- Advertisement -

సినిమాలో ఎవరెవరు పెట్టుబడి పెట్టారన్న అంశంపై ఆరా తీయడంతో పాటు ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆధారాలు లభ్యం కావడంతో విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో డ్రగ్స్‌ ఆరోపణల కేసులో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు వీరిని విచారించారు. అప్పట్లో ఛార్మి కోర్టును ఆశ్రయించడంతో విచారణకు బ్రేక్‌ పడింది. ఇపుడు ఫెమా నిబంధనల ఉల్లంఘనపై మరో కేసులో ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్‌ నేత జడ్సన్‌ కూడా దీనిపై ఈడికి ఫిర్యాదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement