Tuesday, March 26, 2024

ఆచార్య నుంచి ‘భలే భలే బంజారా’ పాట ప్రోమో రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి, ఆయ‌న త‌న‌యుడు మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌న సినిమా ‘ఆచార్య’ ఈ ఏప్రిల్ 29న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌వుతుంది. కాగా.. మూవీ యూనిట్ ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీని వేగ‌వంతం చేసింది. సోమ‌వారం సాయంత్రం 4:05 నిమిషాల‌కు ఈ సినిమా నుంచి ‘భ‌లే భ‌లే బంజారా’ అనే లిరికల్ సాంగ్‌ను విడుద‌ల చేస్తామ‌ని మేక‌ర్స్ అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ రోజు స‌ద‌రు లిరిక‌ల్ సాంగ్‌కు సంబంధించిన గ్లింప్స్‌ను విడుద‌ల చేశారు.

గ్లింప్స్‌లో చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ వేసిన స్టెప్స్ మెగా ఫ్యాన్స్‌నే కాదు, సామాన్య సినీ ప్రేక్ష‌కుల‌ను కూడా ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. మ‌ణిశ‌ర్మ సంగీత సార‌థ్యం వ‌హించిన ‘ఆచార్య’ సినిమాలో ‘భలే భలే బంజారా’ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా శంకర్ మహాదేవన్, రాహుల్ సిప్లిగంజ్ పాడారు. గ్లింప్స్ ఈ రేంజ్‌లో ఉంటే సినిమాలో ఇటు చిరంజీవి, అటు రామ్ చ‌ర‌ణ్ స్టెప్స్ ఎలా ఆక‌ట్టుకుంటాయ‌నేది ఎగ్జ‌యిట్‌మెంట్‌ను పెంచింది.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement