Saturday, April 20, 2024

‘ఆరెంజ్’ రీ-రిలీజ్ డేట్స్ కన్ఫర్మ్ చేసిన నిర్మాత నాగ‌బాబు

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్ కి అయితే ఈ మార్చ్ నెల ఓ అదిరే ట్రీట్ అని చెప్పాలి. గత ఏడాది మార్చ్ లో రిలీజ్ అయిన RRR సినిమా ఈ మార్చ్ లో ఆస్కార్స్ లో గెలుపొందడం. ఇదే మార్చ్ లో రామ్ చరణ్ బర్త్ డే కూడా ఉండడంతో ఫ్యాన్స్ కి మంచి హైప్ క్రియేట్ అయింది. ఇదిలా ఉండగా చరణ్ బర్త్ డే కానుకగా తన కెరీర్ లోనే క‌ల్ట్ క్లాసిక్ మూవీ “ఆరెంజ్” సినిమా రీ-రిలీజ్ ప్లాన్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

మార్చ్ 27 న చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. అయితే లేటెస్ట్ గా నిర్మాత నాగ‌బాబు ఈ సినిమా రీ-రిలీజ్ డేట్స్ ని కన్ఫర్మ్ చేశారు. ఈ మూవీ ఈ నెల (మార్చ్) 25, 26 తేదీల్లో థియేటర్లలో ఉంటుందని వెల్లడించారు. రిలీజ్ అయిన తర్వాత రొమాంటిక్ డ్రామా కాన్సెప్ట్‌కు కల్ట్ ఫాలోయింగ్‌ను పొందింది. మరి ఇప్పుడు ఈ సినిమా రీ-రిలీజ్ ఎలా ఉంటుందో చూడాలి. అలాగే ఈ సినిమాకి వచ్చే వసూళ్లు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కి ఫండ్ డ్రైవ్‌కు విరాళంగా ఇవ్వనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement