Sunday, March 24, 2024

‘ఐకాన్’ పై దిల్ రాజు ఫుల్ ఫోకస్

ప్రముఖ నిర్మాత దిల్ రాజు మొత్తం ఫోకస్ ఐకాన్ సినిమాపైనే ఉందంటూ క్లారిటీ ఇచ్చారు. వకీల్ సాబ్ సక్సెస్ మీట్ లో మాట్లాడిన ఆయన వ్యక్తిగతంగా ఐకాన్ స్క్రిప్ట్ కు కనెక్ట్ అయ్యానని వేణు శ్రీరామ్ చెప్పిన లైన్ చాలా బాగా నచ్చిందని… ఇప్పటికే పూర్తి స్క్రిప్ట్ కూడా రెడీ చేశామని చెప్పారు. ఇంక సినిమా మొదలు పెట్టడమే తరువాయి ఉందని క్లారిటీ ఇచ్చారు.

కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు ను ఆలస్యం చేయవలసి వచ్చిందని. ఇక ఇప్పుడు ఆగేది లేదని చెప్పుకొచ్చారు. వకీల్ సాబ్ రిలీజ్ కు ముందు నో ఐడియా అని చెప్పిన దిల్ రాజు.. రిలీజ్ తర్వాత మాత్రం ఐకాన్ రెడీ అంటూ చెప్పడం విశేషం. ఇక ఈ సినిమాకి కూడా వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించబోతున్నాడు. మరోవైపు బన్ని ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బన్నీ ఐకాన్ చేయబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. మరి బన్నీ ఐకాన్ సినిమా చేస్తాడా లేక వేరొక దర్శకుడికి అవకాశం ఇస్తాడు అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement