Saturday, April 20, 2024

అల్లుఅర్జున్, విజయ్ దేవరకొండపై మనసులోని మాట బయటపెట్టిన ప్రియాంక

విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన టాక్సీవాలా చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా ప్రియాంక జవాల్కర్ పరిచయం అయింది. అనంతపురం కు చెందిన ఈ అమ్మడు మొదటి సినిమాతోనే తనలోని నటనతో అందంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు నటించిన తిమ్మరుసు, ఎస్ ఆర్ కళ్యాణమండపం చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ సినిమాలు కూడా మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకోవడంతో పాటు నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి.

అయితే ఈ సినిమాలు సక్సెస్ కావటంతో ఫుల్ హ్యాపీగా ఉందట ప్రియాంక జవాల్కర్. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ…. అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ పై ఆసక్తి కర కామెంట్స్ చేసింది ప్రియాంక. అల్లు అర్జున్ అంటే క్రష్ అని… విజయ్ దేవరకొండ తనకంటే చిల్ అంటూ వారి క్యారెక్టర్స్ పై కామెంట్స్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement