Friday, March 29, 2024

ప్రియాంక జవాల్కర్…టైం ఆగయా !!

ప్రియాంక జవాల్కర్…. విజయ్ దేవరకొండ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాక్సీవాలా సినిమా తో హీరోయిన్ గా పరిచయమైంది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ అమ్మడుకు వరుస అవకాశాలు వస్తాయని అందరూ భావించారు. కానీ అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు. అయితే ఇప్పుడు ప్రియాంక జవాల్కర్ కు సంబంధించిన వరుస సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో ఒకటి ఎస్ ఆర్ కళ్యాణమండపం. కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియాంక జవాల్కర్ కాలేజ్ స్టూడెంట్ గా కనిపించనుంది.

ఆగస్టు 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే సత్య దేవ్ హీరోగా తెరకెక్కుతున్న తిమ్మరుసు సినిమాలో కూడా నటిస్తుంది. ఈ సినిమా జూలై 30 న రిలీజ్ కాబోతుంది. అలాగే శివ కందుకూరి హీరోగా నటిస్తున్న గమనం సినిమాలో కూడా నటిస్తోంది. ఈ సినిమాకు సుజనా రావు దర్శకత్వం వహించారు. అలాగే కీలక పాత్రలో శ్రీయ శరన్ ,నిత్యమీనన్ నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement