Tuesday, April 23, 2024

బయోపిక్ వద్దు..సినిమా తీసేంత సమయం రాలేదు: ప్రియాంక చోప్రా..

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా బయోపిక్ పై ఎప్పటి నుంచో రూమర్స్ వస్తున్నాయి. అయితే తాజాగా తన బయోపిక్ తెరకెక్కించడంపై ఈ హాట్ బ్యూటీ స్పందించింది. దయచేసి తన బయోపిక్ తీయవద్దని ప్రియాంక కోరింది. తన జీవితంతో బయెపిక్ తీసేంత సమయం ఇప్పుడే రాలేదని..తాను ఇంకా సాధించాల్సింది చాలా ఉందని చెప్పుకోచ్చింది. అప్పుడే తనను బయోపిక్ ల జాబితాలో చేర్చకండి అంటూ కోరింది. ప్రియాంక చోప్రా బాలీవుడ్‌తో పాటు, హాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకోంది. కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న ప్రియాంక ఒక్కో మెట్టు ఎక్కుతూ పలు అవార్దులు కూడా సొంతం చేసుకోంది. అంతేకాదు హాలీవుడ్ లోను ఈ ముద్దుగుమ్మ విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఇక ప్రియాంక చోప్రా తనకన్నా పదేళ్ల చిన్నవాడు నిక్‌ జొనాస్‌ను వివాహం అడిగిన విషయం తెలిసిందే. దీంతో ఆమే కెరియర్ బాలీవుడ్ టూ హాలీవుడ్ మధ్యలో నిక్ జోనాస్ వ్యవహారంతో ఓ బయెపిక్ తెరకెక్కిస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తుందని.. బాలీవుడ్ ఫిల్మిం సర్కిల్స్ లో ఎప్పటి నుంచో టాక్ నడుస్తోంది.. ఈ నేపథ్యంలో ప్రియాంక పై విధంగా స్పందించింది. చూడాలి మరి ఈ అమ్మడు తన బయోపిక్ తీయడానికి ఎప్పుడు ఒప్పుకుంటుందో..

ఇది కూడా చదవండి : ఒకే వ్యక్తిలో ఒకేసారి రెండు కరోనా వేరియంట్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement