Thursday, April 25, 2024

ప్రియమణికి నీలాంబరి లాంటి పాత్ర కావాలట!!

యమదొంగ సినిమా తో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి సూపర్ డూపర్ హిట్ ను అందుకుంది హీరోయిన్ ప్రియమణి. పెళ్లయిన కొత్తలో, గోలీమార్, వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలలో నటించింది. ఆ తర్వాత కొన్ని ఫెయిల్యూర్స్ ను కూడా చూసింది. ఆ తరువాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయింది. లాంగ్ గ్యాప్ తర్వాత టీవీ షోలో జడ్జిగా ప్రత్యక్షమైంది.

ఇక అక్కడి నుంచి కూడా వరుస సినిమాలు చేస్తూ మంచి జోష్ చూపిస్తోంది. ప్రస్తుతం వెంకటేష్ నారప్ప సినిమాతో పాటి విరాటపర్వం సినిమాలో కామ్రేడ్ భారతక్కగా నటిస్తోంది. త్వరలోనే ఈ రెండు సినిమాలు కూడా థియేటర్ లోనే రానున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రియమణి మాట్లాడుతూ…. నేను చేసిన ఈ రెండు పాత్రలు చాలా విభిన్నమైనవి. తెలుగులో నా కెరీర్ ఊపందుకునేలా చేసే పాత్రలు అవి. నరసింహ సినిమాలో రమ్యకృష్ణ చేసిన నీలాంబరి తరహా పాత్రలు చేయాలని ఉంది. పొగరు పంతం తో కూడిన పాత్రలు నాకు సెట్ అవుతాయి. అలాంటి పాత్ర కోసం వెయిట్ చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది ప్రియమణి.

Advertisement

తాజా వార్తలు

Advertisement