Thursday, November 28, 2024

Priya Prakash | లంగావోణితో జ‌ల‌కాలాట‌..

జ‌ల‌కాలాట కోసం మ్యాప్ వేసుకుని..అందంగా ముస్తాబై..ప‌ట్టు లంగావోణీ లు లాంటివి ఎవ‌రైనా ధ‌రించి చూసారా? అంటే ఇదొక్క‌డి చోద్యం అంటారు. కానీ ఓవ‌ర్ నైట్ స్టార్ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ అలా భిన్నంగా ట్రై చేసి స‌క్సెస్ అయింది. ఇదిగో ఇక్క‌డిలా స్విమ్మింగ్ పూల్ లో అమ్మ‌డి పోటో సెష‌న్ చూస్తే స్ట‌న్ అవ్వాల్సిందే.

రెండు చేతుల‌కు మ‌ల్లె పూలు ధ‌రించింది. ఎంతో అందంగా హెయిర్ స్టైల్ చేసుకుంది. మ్యాక‌ప్ వేసుకుంది. నుదిటిన రూపాయి బిళ్లంగా బొట్టు పెట్టుకుంది. ప‌ట్టు ప‌రికిణీ ధ‌రించింది. టాప్ లో మ్యాచింగ్ బ్లౌజ్ ధ‌రించింది.

ఇదే దుస్తుల్లో ఈత కొల‌నులోకి దిగి వివిధ భంగిమ‌ల్లో ఫోజులిచ్చింది. ప్రియాని అలా చూసి అంతా స్ట‌న్ అవుతున్నారు. రెగ్యుల‌ర్ స్విమ్ షూట్ల‌కు భిన్నంగా ఇలా ట్రై చేసింది. యూనిక్ గానూ హైలైట్ అవుతుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement