Sunday, May 28, 2023

హ‌నుమాన్ పోస్ట‌ర్ తో.. అంచ‌నాలు పెంచేసిన ప్ర‌శాంత్ వ‌ర్మ‌

ఇప్ప‌టికే హీరో తేజ స‌జ్జాతో జాంబిరెడ్డి చిత్రాన్ని తీసి హిట్ అందుకున్నాడు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. కాగా మ‌రోసారి తేజ సజ్జాతో ఫస్ట్ ఇండియన్ సూపర్ హీరో మూవీ చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ. హనుమాన్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా టీజర్ తోనే సూపర్ బజ్ ఏర్పరచుకున్నారు. హనుమాన్ సినిమా నుంచి శ్రీరామనవమి సందర్భంగా ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. హనుమంతుడు గుండెల్లో కొలువుదీరిన సీతారాములను చూపిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ అదిరిపోయింది. హనుమాన్ సినిమాలో బీభత్సమైన గ్రాఫిక్స్ ఉన్నట్టు తెలుస్తుంది.హనుమాన్ కథాంశంతో ఈ సినిమా వస్తుందని అర్ధమవుతుంది. ప్రశాంత్ వర్మ ఈ సినిమాను చాలా ఫోకస్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 6 హనుమాన్ జయంతి రోజు రిలీజ్ ఫిక్స్ చేశారు.ఇది కేవలం పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ సినిమాగా ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement