Wednesday, April 24, 2024

ఎన్టీఆర్ బర్త్ డే రోజే ఆ అప్డేట్ కూడా ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస హిట్లతో మంచి జోష్ మీద ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చూస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ తో కూడా ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నాడు.

అయితే మరో రెండు రోజుల్లో ఎన్టీఆర్ పుట్టినరోజు రాబోతుంది. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి కొమరం భీమ్ కు సంబంధించిన ఓ పోస్టర్ రిలీజ్ కాబోతోంది. అలాగే కొరటాల శివ సినిమాకు సంబంధించి కూడా అప్డేట్ రాబోతుందని అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు ప్రశాంత్ నీల్ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా రాబోతుందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement