Thursday, April 25, 2024

వేణుపై ప్రశంసల వర్షం.. అమెజాన్‌లో రెండో స్థానంలో ‘బలగం’

ఏదైనా ఒక సినిమాకి థియేటర్లలో అలాగే OTTలో ఇలా రెండు ప్లాట్‌ఫారమ్‌లపై అద్బుతంగా రాణించడం చాలా రేర్. అలాంటిది, విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ ‘బలగం’ దీనిని సాధ్యం చేసి చూపిస్తోంది. వేణు యెల్దండి దర్శకత్వంలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌రామ్‌లు లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమా ప్రముక ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయింది. ఈ మూవీ భారతదేశంలోని ప్రైమ్ వీడియో చార్ట్‌లలో రెండవ స్థానంలో ట్రెండింగ్‌లో నడుస్తోంది.

చాలా మంది నెటిజన్లు సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో ఎమోషన్స్ ను హ్యాండిల్ చేసిన విధానానికి డైరెక్టర్ వేణు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షితారెడ్డి ఈ విలేజ్ డ్రామాని నిర్మించారు. వేణు యెల్దండి, మురళీధర్ గౌడ్, జయరామ్, రూప, రాచ రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement