Monday, October 14, 2024

Pragya Jaishwal | ప్ర‌గ్యను చూస్తే కంచె దాటాల్సిందే….

కంచె బ్యూటీ ప్ర‌గ్య జైశ్వాల్ కెరీర్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. చాలా కాలంగా స్టార్ డ‌మ్ కోసం ఈ బ్యూటీ చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. నంద‌మూరి బాల‌కృష్ణ సహా ప‌లువురు యువ‌హీరోల స‌ర‌స‌న తెలుగులో అవ‌కాశాలు అందుకున్న ప్ర‌గ్య‌ అటుపై బాలీవుడ్ లో స‌ల్మాన్ భాయ్ సినిమాలోను న‌టించింది కెరీర్ ప‌రంగా అంత‌గా మైలేజ్ ని ఇవ్వ‌లేదు.

అయినా ప‌ట్టువ‌ద‌ల‌ని ఈ బ్యూటీ ఇప్ప‌టికీ త‌న ప్ర‌య‌త్నాల‌ను విర‌మించ‌లేదు. మ‌రోవైపు సోష‌ల్ మీడియాల్లో ఆర్జ‌న కోసం ప్ర‌గ్య నిరంత‌రం ఫోటోషూట్లు, వీడియోల‌ను షేర్ చేస్తోంది. సామాజిక మాధ్య‌మాల్లో అభిమానుల‌కు నేరుగా ట‌చ్ లో ఉంటోంది. తాజాగా ప్ర‌గ్య షేర్ చేసిన ఓ స్పెష‌ల్ ఫోటోషూట్ ఇంటర్నెట్ లో వైర‌ల్ గా మారింది.

ఈ కొత్త లుక్ యూత్ లోకి వేగంగా దూసుకెళుతోంది. ప్ర‌గ్య హాఫ్ వైట్ చీర‌లో ఎంతో అందంగా ఒద్దిక‌గా క‌నిపిస్తోంది. కాంబినేష‌న్ గా హాఫ్ షోల్డ‌ర్ వైట్ బ్లౌజ్ ని ధ‌రించి, నాభి దిగువ‌గా చీర‌ కుచ్చిళ్ల‌ను దోపిన వైనం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఆన్ లొకేష‌న్ నుంచి ఈ స్పెష‌ల్ ఫోటోషూట్ ని ప్ర‌గ్య షేర్ చేసింద‌ని ఫోటోలు చూస్తే అర్థ‌మ‌వుతోంది. అయితే ప్ర‌గ్య వైట్ అండ్ స్వీట్ లుక్ చూశాక నెటిజ‌నులు ర‌క‌ర‌కాలుగా కామెంట్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement