Thursday, March 28, 2024

లుంగీలో సర్ ప్రైజ్ చేయనున్న ప్రభాస్.. మాస్​ లుక్​ కోసం మారుతి ప్లాన్​

దేశవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు ప్రభాస్‌. ప్రస్తుతం ఆదిపురుష్, సాలార్, స్పిరిట్, రాజా డీలక్స్, ప్రాజెక్ట్ కె వంటి హై-ప్రొఫైల్ సినిమాల‌లో నటిస్తున్నాడు. అయితే తాజా వార్త‌ల ప్ర‌కారం.. ప్రభాస్ లుంగీలో మాస్ మేనియా క్రియేట్ చేయనున్నాడని తెలుస్తోంది. కాగా, ప్రభాస్ రాజా డీలక్స్ లో సినిమాలో నటిస్తున్నాడు.. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాలో ప్రభాస్ హీరోయిజాన్ని ఎలివేట్ చేయడానికి మారుతి ఎటువంటి చాన్స్ ని కూడా వదలడం లేదని తెలుస్తోంది.. ఈ క్ర‌మంలోనే ఈ మూవీలో ప్రభాస్ లుంగీ ధరించి పూర్తి మాస్ లుక్‌లో కనిపిస్తాడని తెలుస్తోంది.

ఈ సినిమాలో ప్రభాస్… మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ ముగ్గురు హాట్ బ్యూటీలతో రొమాన్స్ చేస్తున్నాడు. అంతే కాకుండా.. సంజయ్ దత్, సత్యరాజ్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మాళవిక మోహన్ ఇటీవల అభిమానులతో మాట్లాడుతూ, ప్రభాస్ ఆకర్షణీయమైన వ్యక్తి అంటూ ప్రశంసలు కురిపించారు. ఈ మూవీలో ప్రభాస్ తాతగా సంజయ్ దత్.. ప్రభాస్ తండ్రిగా సత్యరాజ్ నటిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement