Friday, April 19, 2024

క్లాప్ కొట్టిన ప్రభాస్…షూట్ స్టార్ట్

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్ చేసి చాలా సమయం అవుతున్నా… ఇప్పటివరకు స్టార్ట్ కాలేదు. తాజాగా ఈ రోజు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమాకు క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ షెడ్యూల్ లో అమితాబ్ కు సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. నిన్ననే అమితాబ్ బచ్చన్ హైదరాబాద్ కి కూడా చేరుకున్నారు.

అయితే ప్రభాస్ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు ప్రభాస్. ఇది ప్రారంభం..గురు పూర్ణిమ ప్రత్యేక రోజున మేము భారతీయ సినిమా గురువుతో ప్రారంభించాము అంటూ ట్వీట్ చేశారు. ఈ గురు పూర్ణిమ రోజున భారతీయ సినిమా గురువు కోసం క్లాప్ కొట్టడం గౌరవంగా భావిస్తున్నాను అంటూ ప్రభాస్ పేస్ బుక్ లో పోస్ట్ చేశారు.

https://www.facebook.com/100044196081040/posts/382943369855529/?sfnsn=wiwspmo
Advertisement

తాజా వార్తలు

Advertisement