Thursday, March 28, 2024

ప్రాజెక్ట్-K షూట్ లో రీ-జాయిన్ అయిన ప్ర‌భాస్.. ఎక‌కాలంలొ రెండు పాన్ ఇండియా సినిమాలు..

ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస పాన్ ఇండియా సినిమాల‌తో బిజీగా గడుపుతున్నాడు. ఇటీవ‌లే ‘రాధేశ్యామ్‌’తో ల‌వ్ యాంగిల్ చూపించి ప్రేక్ష‌కుల‌ను పల‌క‌రించిన ప్ర‌భాస్ త‌న త‌దుప‌రి సినిమాల‌పై ఫుల్ ఫోక‌స్‌ను పెట్టేసాడు. ప్ర‌స్తుతం ప్రశాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ‘స‌లార్‌’, నాగ్ అశ్విన్ ద‌ర్వ‌క‌త్వంలో ‘ప్రాజెక్ట్-K’ సినిమాల షూటింగ్‌ల‌లో ఏక‌కాలంలో పాల్గొంటున్నాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమవుతున్న ప్రాజెక్ట్-K సినిమా ఇప్పటికే కొంతవరకూ షూటింగును జరుపుకుంది. ఇది పాన్ వరల్డ్ సినిమా అని నాగ్ అశ్విన్ చెప్పడంతో అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

అయితే ప్ర‌భాస్ మోకాలు స‌ర్జ‌రీ కార‌ణంగా కొన్ని రోజుల నుంచి రెస్ట్ తీసుకుంటున్నాడు. తాజాగా ఈయ‌న ప్రాజెక్ట్-K షూట్‌లో జాయిన్ అయ్యాడ‌ట‌. ప్ర‌స్తుతం ఈ సినిమా కోసం తోట తరణి పర్యవేక్షణలో హైదరాబాదులో మూడు భారీ సెట్లు వేశారు. ఈ కథ మొత్తానికి ఈ మూడు సెట్స్ చాలా కీలకం. ఈ మూడు సెట్స్ లోనే మేజర్ పార్టు షూటింగును జరపనున్నారు. ప్రస్తుతం ఈ సెట్స్ లోనే చిత్రీకరణ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. తాజా షెడ్యూల్లో ప్రభాస్.. అమితాబ్ .. దీపిక పాల్గొంటున్నారు. ఈ షెడ్యుల్ పూర్త‌వ్వ‌గానే ప్ర‌భాస్ ‘స‌లార్’ బిగ్ షెడ్యూల్‌లో పాల్గొన‌నున్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement