Saturday, April 20, 2024

ప్రభాస్ రామ్ చరణ్.. త్వరలో మల్టీస్టారర్ ?

ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీ లు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే వెంకటేష్ , వరుణ్ తేజ్, వెంకటేష్, రామ్ పోతినేని వంటి స్టార్స్ మల్టీస్టారర్ సినిమా చేయగా..ప్రస్తుతం రాంచరణ్, ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా చూస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్, రానా కూడా ఓ సినిమా చేస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం యు.వి.క్రియేషన్స్ బ్యానర్ రామ్ చరణ్, ప్రభాస్ లు హీరోగా ఓ సినిమా చేయబోతోందట.

ఒక యువ దర్శకుడు యు.వి.క్రియేషన్స్ కు ఓ మంచి ప్రేమ కథను వినిపించగా… నిర్మాతలకు అది చాలా బాగా నచ్చిందట. కాగా ఈ సినిమాలో ప్రభాస్, రామ్ చరణ్ నటిస్తేనే బాగుంటుందని వారు భావించారట. వారు కూడా ఖచ్చితంగా ఒప్పుకొంటారని అనుకుంటున్నారట. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement