Saturday, April 20, 2024

ప్రభాస్ రాధే శ్యామ్ కూడా స్టార్ట్ అయిపోయింది!

జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రాధేశ్యామ్. పిరియాడికల్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ మోషన్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఓ పది రోజుల పాటు రీ షూట్ ను ప్లాన్ చేసింది. అయితే స్టార్ట్ చేయాలి అనుకున్న సమయంలో కరోనా వ్యాప్తి ఎక్కువైంది.

దీంతో షూటింగ్ కు బ్రేక్ వచ్చింది. కాగా తాజాగా శుక్రవారం ఉదయం హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అయితే ఈ షెడ్యూల్ లో నాలుగు రోజుల పాటు టాకీ సన్నివేశాలను షూట్ చేయబోతున్నారట. అలాగే ప్రభాస్ పూజ హెగ్డే లపై ఓ సాంగ్ ను చిత్రీకరించనున్నారు.ఇక ఈ సినిమాకు హిందీలో మిథూన్, మనన్ భరద్వాజ్ సంగీతం అందించగా, జస్టిన్ ప్రభాకరన్ తెలుగు వెర్షన్ కు సంగీతం అందించారు.

ఆవేదన తో వచ్చా…ప్రశ్నిస్తాం !! ప్రకాష్ రాజ్

Advertisement

తాజా వార్తలు

Advertisement