Friday, March 29, 2024

ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమా స్టార్ట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా చేస్తున్నాడు. దీంతో పాటు ఆదిపురుష్ సినిమా కూడా చేస్తున్నాడు. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉండగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు ప్రభాస్. ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే అమితాబచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన చేసి చాలా కాలం అవుతున్న షూటింగ్ మాత్రం స్టార్ట్ కాలేదు.

అయితే ఈ సినిమా షూటింగ్ ఈ రోజే స్టార్ట్ అవుతుంది. ప్రత్యేకంగా వేసిన సెట్ లో వారం రోజుల పాటు కొన్ని అమితాబ్ పై సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. ప్రభాస్, దీపికలు తర్వాత షెడ్యూల్ లో జాయిన్ కాబోతున్నట్లు సమాచారం. వైజయంతి మూవీస్ బ్యానర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement