Wednesday, April 24, 2024

ఫిట్ నెస్ ట్రైనర్ గా ప్రభాస్ హీరోయిన్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకునే గురించి సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం దీపిక పదుకొనే షకున్‌ బత్రా దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఓ సినిమాలో నటించబోతోంది. అలాగే ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ అనన్య పాండే కూడా నటించనుంది. ఈ ఇద్దరూ కూడా ఈ సినిమాలో అక్క చెల్లెలు గా కనిపించనున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఫిట్నెస్ ట్రైనర్ గా దీపిక పదుకొనే కనిపించబోతుందట.

ఫిట్నెస్ విషయంలో దీపికాపదుకొనె మొదటి నుంచి కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇక ఈ సినిమా కోసం ఇప్పుడు మరింత ఎక్కువ కేర్ తీసుకుంటుందట దీపికాపదుకొనె. ఇక ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న పాన్ వరల్డ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement