Saturday, April 20, 2024

ప్రభాస్ ‘రాధే శ్యామ్’ మోషన్ పోస్టర్ తోనే దుమ్ముదులుపుతున్నాడు!!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్, లుక్స్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి.

ఇక మరోవైపు ఇండియా లోనే ఏ పాన్ ఇండియన్ సినిమా గ్లింప్స్ కి కూడా రాని రికార్డ్ ఈ సినిమాకు వచ్చింది. ఈ సినిమా మోషన్ పోస్టర్ 20 మిలియన్ వ్యూస్ తో ఇండియా లోనే మరో యూనిక్ ఫీట్ ను సాధించింది. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ కి కూడా ఈ స్థాయిలో క్రేజ్ రాలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement