Saturday, April 20, 2024

సలార్ లో ప్రభాస్ డ్యూయల్ రోల్ ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలతోపాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే ఈ సినిమా కొంతమేర షూట్ కంప్లీట్ చేసుకుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ప్రభాస్ రొల్ కు సంబంధించి మొదటి నుంచి రకరకాల వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే ఇప్పుడు దీనిపై మళ్లీ లేటెస్ట్ వార్త ఒకటి బయటకు వచ్చింది. ప్రభాస్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement