Friday, March 29, 2024

వేణు శ్రీరామ్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన వకీల్ సాబ్ ?

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వకీల్ సాబ్. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాలీవుడ్ లో అమితాబ్ నటించిన పింక్ సినిమాకు రీమేక్ చిత్రం. ఏప్రిల్ 9న రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు మంచి వసూళ్లు కూడా రాబట్టింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అది ఏంటంటే దర్శకుడు వేణు శ్రీరామ్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడట. హైదరాబాద్ లో ఓ త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ బహుమతిగా ఇచ్చాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియరాలేదు. మరోవైపు ఈ సినిమాలో శృతి హసన్ హీరోయిన్ గా నటించగా.. నివేద థామస్, అంజలి అనన్య కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement