Saturday, September 25, 2021

ముహూర్తం ఫిక్స్….వకీల్ సాబ్ ట్రైలర్ వచ్చేస్తుంది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం వకీల్ సాబ్. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ నటించిన పింక్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే సమ్మర్ కానుకగా ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పాటలు మోషన్ పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచాయి. ఇక తాజాగా ట్రైలర్ ని కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేయబోతుంది. ఈనెల 29న వకీల్ సాబ్ ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. మరోవైపు ఏప్రిల్ 4న ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా రాబోతున్నారని తెలుస్తోంది.

ముహూర్తం ఫిక్స్….వకీల్ సాబ్ ట్రైలర్ వచ్చేస్తుంది

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News