Tuesday, March 26, 2024

వకీల్ సాబ్ లో యాభై నిమిషాలకు పవన్ ఎన్ని కోట్లు తీసుకున్నాడు తెలుసా ?

పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సినిమా ఎలా ఉన్నా సరే వసూళ్లకు డోకా ఉండదు. కాగా ఇప్పుడు లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ వకీల్ సబ్ సినిమా తో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హిందీలో తెరకెక్కిన పింక్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని మార్పులు చేశారు దర్శకుడు.

కాగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్లు, ట్రైలర్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇటీవలే సెన్సార్ బోర్డు కూడా 155 నిమిషాల నిడివితో యూ/ఏ జారీ చేసింది. ఇదిలా ఉండగా పవన్ ఈ సినిమాకి తీసుకున్న రెమ్యూనరేషన్ పై అటు అభిమానుల్లోనూ ఇటు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ సినిమాలో పవన్ స్క్రీన్ పై 50 నిమిషాలు పాటు కనిపిస్తాడట. నిజానికి పింక్ సినిమాలో అమితాబ్ చాలా తక్కువ సమయం కనిపిస్తారు. కానీ తెలుగులో మాత్రం పవన్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని పాత్ర నిడివి పెంచారు.

కాగా మొత్తం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల సినిమాలో పవన్ పాత్ర 50 నిమిషాల పాటు ఉండగా మిగిలిన టైమ్ అంతా నివేద థామస్, అంజలి, అనన్య చుట్టూ తిరుగుతుందట. అయితే పవన్ ఇందులో నటించడానికి 50 కోట్ల రూపాయల వరకూ తీసుకున్నాడని తెలుస్తోంది. అంటే దీనిబట్టి యాభై నిమిషాలకు 50కోట్ల అంటే నిమిషానికి కోటి రూపాయలా అంటూ ఆశ్చర్య పోతున్నారు నెటిజన్స్ .

Advertisement

తాజా వార్తలు

Advertisement