Thursday, April 25, 2024

వకీల్ సాబ్ వన్ వీక్ కలెక్షన్స్

లాంగ్ గ్యాప్ తరువాత స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా వకీల్ సాబ్. ఏప్రిల్ 9న విడుదల అయిన ఈ చిత్రం ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. కాగా అధికారికంగా మాత్రం వకీల్ సాబ్ లెక్కలు ప్రకటించాల్సి ఉంది. మొదటి వారానికి సంబంధించి ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం…. మొదటి రోజు 40.10 కోట్లు,రెండో రోజు 17. 10 కోట్లు, మూడో రోజు 16. 05 కోట్లు, నాలగవ రోజు – 6.00 కోట్లు, ఐదో రోజు 11 కోట్లు, ఆరో రోజు 10. 55 కోట్లు. మొత్తంగా వరల్డ్ వైడ్ కలెక్షన్లు 100. 75 కోట్లు సాధించినట్టు తెలుస్తుంది.

ఇక నైజాం ఏరియాలో తొలివారంలో మొత్తంగా రూ. 30 కోట్లు మార్క్ చేరుకున్నట్టు తెలుస్తోంది. సీడెడ్‌లో రూ.15 కోట్లు.. ఉత్తరాంధ్రలో 12 కోట్లు పైనే రాబట్టిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement