Friday, March 29, 2024

వకీల్ సాబ్ 8వ రోజు కలెక్షన్లు చూస్తే దిమ్మ తిరగాల్సిందే !!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వకీల్ సాబ్. భారీ అంచనాల మధ్య థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం రెండవ వారంలో కూడా వసూళ్ల పరంపరను కొనసాగిస్తోంది. తెలుగు రాష్ట్రాలలో 8వ రోజు వకీల్ సాబ్ చిత్ర కలెక్షన్లు చూసుకుంటే… నైజాంలో 38 లక్షలు, సీడెడ్ 18 లక్షలు, ఉత్తరాంధ్రలో 22 లక్షలు, తూర్పుగోదావరి జిల్లాలో 7 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 6 లక్షలు, గుంటూరు జిల్లాలో 8 లక్షలు, కృష్ణాజిల్లా మొత్తంగా 4.26 కోట్లను వసూలు చేసింది. అంతే కాదజు లాక్‌డౌన్‌ తర్వాత అత్యధికంగా వసూళ్లు రాబట్టిన చిత్రంగా వకీల్ సాబ్ నిలిచింది.

ఏపీ, నైజాంలో కలిపి రెండోవారంలో మొత్తంగా 650 పైగా థియేటర్లలో వకీల్ సాబ్ రన్ అవుతుండగా నైజాంలో ఈ చిత్రం 227 థియేటర్లలో, సీడెడ్ 115 థియేటర్స్ లో ఆంధ్రాలో 310 థియేటర్లో నడుస్తుంది. ఇదిలా ఉండగా లాక్‌డౌన్‌ తర్వాత మాస్టర్ చిత్రం 150 కోట్లు వసూలు చేయగా…వకీల్ సాబ్ 109 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అలాగే 65.2 కోట్లు ఉప్పెన సినిమా సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement