Thursday, April 25, 2024

పవన్ హరీష్ శంకర్ ల మూవీ అప్డేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. అందులో హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ ఇటీవలే ఈ సినిమా కోసం ప్రత్యేక ఫోటో షూట్ లో పాల్గొన్నాడట. ఈ షూట్ హరీష్ శంకర్ పర్యవేక్షణలోనే జరిగిందని తెలుస్తోంది. కాగా ఈ సినిమా అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని తెలుస్తోంది.

అంతేకాదు ఈ సినిమాలో పవన్ ఫ్లాష్ బ్యాక్ లో పోలీస్ ఆఫీసర్ గా, తండ్రి పాత్రలో నటించబోతున్నాడని… అలాగే కొడుకు పాత్రలోనూ పవన్ కనిపించనున్నాడట. మరికొంతమంది ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని కూడా ఖండిస్తున్నారు. కాగా గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement