Friday, March 29, 2024

జూనియర్ ఎన్టీఆర్ కిడ్నాప్….!!

జూనియర్ ఎన్టీఆర్ కు ఫ్యాన్స్ లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉండగా ఆఖరుగా స్క్రీన్ పై యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను అరవింద సమేత సినిమాలో చూశారు అభిమానులు. ఈ సినిమా 2018 లో రిలీజ్ అయింది. ఇక అప్పటి నుంచి కూడా ఎన్టీఆర్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే అది కాస్త రాజమౌళి చేతిలో పడటంతో ఆలస్యం అవుతూ వస్తోంది.

ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఓ నెటిజన్ ఎన్టీఆర్ కనిపించట్లేదు అంటూ ఓ పోస్టర్ ని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. 38 ఏళ్ళ వయస్సు…లాస్ట్ సీన్ అక్టోబర్ 11, 2018 అంటూ ఎన్టీఆర్ ఫోటోని పోస్ట్ చేశాడు. అంతే కాకుండా హైదరాబాద్ సిటీ పోలీసులకు ట్విట్టర్ లో ట్యాగ్ కూడా చేశాడు.

అయితే దీనిపై హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగం వారు స్పందిస్తూ సైబర్ క్రైమ్ విభాగానికి ఆ విషయాన్ని ట్యాగ్ చేసింది. అయితే దీనిపై నెటిజన్స్ అభిమానులు రకరకాల కామెంట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ కనిపించకపోవడానికి కారణం రాజమౌళి అని కామెంట్స్ చేస్తున్నారు.

https://twitter.com/PrimeRonaldoCR7/status/1412302891755347996?s=19

Advertisement

తాజా వార్తలు

Advertisement