Thursday, April 25, 2024

బన్నీ పై పూనమ్ ట్వీట్ @దాక్కో దాక్కో మేక

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ఫస్ట్ సింగిల్ ను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. దాక్కో దాక్కో మేక అంటూ సాగే ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుండి విశేషమైన స్పందన లభిస్తోంది. అంతే కాకుండా సినీ స్టార్స్ సైతం సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు.

తాజాగా పూనమ్ కౌర్ ఈ పాటపై ట్వీట్ చేసింది. బన్నీ లుక్, ఆటిట్యూడ్, ఫర్ఫార్మెన్స్ కు ఫిదా అయినట్లు తెలిపింది. ఫ్యాషన్, హార్డ్ వర్క్ అంటే ఇదే అని తెలిపింది. అయితే పవన్ పై ఎప్పుడూ నెగిటివ్ కామెంట్స్ చేసే పూనమ్ ఇప్పుడు బన్నీ పై పాజిటివ్ గా కామెంట్ చేయడం తో ఆమె ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement