Wednesday, April 24, 2024

పవన్ తో పూజా హెగ్డే ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం… హరిహర వీరమల్లు, భీమ్లా నాయక్ సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా భారీ అంచనాలతో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. అయితే వీటితో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే గతంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో గబ్బర్ సింగ్ సినిమా సూపర్ హిట్ సాధించింది.

ఇదిలా ఉండగా ఇప్పుడు హరీష్ శంకర్ సినిమా లో హీరోయిన్ గా ఎవరు నటిస్తారనేది గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చర్చనీయాంశం గా మారింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో పూజ హెగ్డే ని హీరోయిన్ గా అనుకుంటున్నారట. త్వరలోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా… మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement