Thursday, April 18, 2024

చెన్నైకి ఫ్లైట్ ఎక్కిన బుట్ట బొమ్మ…. విజయ్ దళపతి కోసం

బుట్టబొమ్మ హీరోయిన్ పూజా హెగ్డే వరుస సినిమాలతో మంచి జోష్ మీద ఉంది. రాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేసింది ఈ అమ్మడు. అంతేకాకుండా వెంటనే చెన్నైకి ఫ్లైట్ ఎక్కేసిందట.

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజయ్ దళపతి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం బీస్ట్. ఈ చిత్రంలో కూడా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. సన్ పిక్చర్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాలో యోగిబాబు, వీ టీవీ గణేష్, అపర్ణ దాస్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా ఈ రోజు పూజ హెగ్డే విజయ్ దళపతి పై జానీ మాస్టర్ కొరియోగ్రఫీ లో ఓ సాంగ్ షూట్ చేయబోతున్నారని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement