Wednesday, June 16, 2021

100 మంది పేద ప్రజలకు పూజా హెగ్డే సహాయం

కరోనా కష్టకాలంలో పేద ప్రజలకు సహాయం చేయడానికి ఎంతో మంది సినీ స్టార్స్ ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కూడా ముందడుగు వేశారు. 100 మంది పేద ప్రజలకు నెలకు సరిపడా రోజు వారి సరుకులు అందించి తన మంచి మనసు చాటుకున్నారు. అయితే ఈ కష్టకాలంలో పూజా హెగ్డే చేసిన సహాయానికి సినీ అభిమానులు నెటిజన్స్ కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే పూజాహెగ్డే ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా చేస్తోంది. అలాగే సల్మాన్ ఖాన్ చిత్రంతో పాటు రోహిత్ శెట్టి చిత్రలలో కూడా నటిస్తోంది. అలాగే విజయ్ దళపతి సినిమా లో కూడా పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపించనుంది.

Advertisement

తాజా వార్తలు

Prabha News