Saturday, April 20, 2024

పవన్ ను ఫాలో అవుతున్న బుట్టబొమ్మ

పూజా హెగ్డే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఫాలో అవుతోంది. ఫాలో అవడం అంటే ఏ ట్విట్టర్ లోనో లేక ఇంస్టాగ్రామ్ లోనో కాదు. పవన్ కళ్యాణ్ కు ప్రతి ఏడాది తన తోటలో పండిన మామిడి పళ్లను టాలీవుడ్ లో స్టార్స్ కు అలాగే తన ఆప్తులకు గిఫ్ట్ గా పంపుతూ ఉంటారు. అయితే ఇప్పుడు అదే విధంగా పూజ హెగ్డే కూడా తన తోటలో పండిన మామిడి పళ్లను టాలీవుడ్ లో ఉన్న తన స్నేహితులకు దర్శకులకు ఇస్తుందట.

పూజా హెగ్డే కు మంగళూరులో ఓ మామిడితోట ఉందట. అక్కడ పండిన పళ్లను గిఫ్ట్ ప్యాక్ చేసి టాలీవుడ్ లో ఉన్న స్నేహితులకు, దర్శకులకు ,నిర్మాతలకు అందిస్తుందట. ఇదే విషయమై పవన్ కళ్యాణ్ ని పూజా హెగ్డే ఫాలో అవుతుందంటూ నెటిజన్లు ముచ్చటించుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement