Saturday, April 20, 2024

పవన్ రానా సినిమా నుంచి ఫోటో లీక్ !!

సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ సాధించిన అయ్యప్పన్ కోషియమ్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రం కు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు అందిస్తుండడం విశేషం. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. షూటింగ్ లో పాల్గొనే ముందు పవన్ కళ్యాణ్ నడుచు కుంటూ వెళ్తున్న ఫోటో ఒకటి లీకైంది. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక వీటితో పాటు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అలాగే క్రేజీ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు. వీటి తర్వాత గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో లెక్చరర్ గా పవన్ కనిపించబోతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement