Thursday, April 18, 2024

RRR.. బిగ్ డీల్

పాన్ ఇండియా మూవీ RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ ప్రి బిజినెస్ లెక్క‌లు రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన నార్త్ ఇండియా ‌డిస్ట్రిబ్యూష‌న్ రైట్స్‌ను పెన్ స్టూడియోస్ భారీ ధరకు ద‌క్కించుకున్న‌ట్లు సమాచారం. అయితే అమౌంట్ ఎంత అన్న విషయం తెలియాల్సి ఉంది. అంతేకాదు పెన్ స్టూడియోస్ కంపెనీనే అన్ని భాష‌ల‌కు సంబంధించి ఎల‌క్ట్రానిక్, డిజిట‌ల్‌, శాటిలైట్ రైట్స్ కూడా సొంతం చేసుకుంది. ఇందుకు సంబంధించి భారీ ధరను ఆఫర్ చేసిందని తెలుస్తోంది.

గ‌తంలో ఏ సంస్థ కూడా .. ఏ సినిమాకు ఇంత ఇవ్వ‌లేద‌ని టాక్ వినిపిస్తోంది. రాజ‌మౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచ‌నాలు ఎవ‌రెస్ట్ అంత హైట్‌లో ఉన్నాయి. ఈ మూవీలో లీడ్ రోల్స్ చేస్తున్న‌ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌, అలియా భ‌ట్‌, ఒలీవియా మోరిస్ ఫ‌స్ట్ లుక్స్ విడుద‌ల చేసి అంచనాలను ఎక్క‌డికో తీసుకెళ్లారు. అక్టోబ‌ర్ 13న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement